Posts

Showing posts with the label అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి... ఓట్లను ఎలా లెక్కిస్తారు? విజేతను ఎలా ప్రకటిస్తారు?

Image
  అమెరికా అధ్యక్షుడంటే మాటలు కాదు. యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణంలో మార్పులు... ఇలా ఏ సంక్షోభం వచ్చినా, దానిపై దేశాల స్పందనను అమెరికా అధ్యక్ష పీఠం ప్రభావితం చేస్తుంది. ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనా, ఫలితాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియపై చాలా కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. బీబీసీ ప్రతినిధులుగా మేం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎలక్ట్రోరల్ కాలేజీ ఎలా పని చేస్తుంది, ఏ రాష్ట్రం కీలకంగా మారనున్నాయనే విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మీరు మొదటిసారి తెలుసుకోవాలనుకున్నా, ఉన్న అవగాహనను మరింత పెంచుకోవాలని అనుకున్నా ఈ సింపుల్ గైడ్‌ మీకు సహాయపడుతుంది. ఎన్నికలు ఎప్పుడు, అభ్యర్ధులు ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రతిసారి నవంబర్‌ మొదటి సోమవారం తర్వాతి మొదటి మంగళవారం జరుగుతాయి. సర్వసాధారణంగా మూడో తేదీకి అటు ఇటుగా ఎన్నికలుంటాయి. చాలా ఇతర దేశాల ఎన్నికలతో పోలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే జరుగుతాయి. ఈ రెండు పార్టీల్లోని ఏదో ఒకదాని నుంచి అధ్...