Posts

Showing posts with the label సలీం.. అనార్కలీ

సలీం.. అనార్కలీ

Image
                            సలీం.. అనార్కలీ      మొఘల్‌ సామ్రాట్‌ అక్బర్‌ కుమారుడైన సలీం ఓ రోజు దానిమ్మ తోటలో ఉండగా ఓ అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. తాను యువరాజునని చెప్పకుండా ఆమెతో స్నేహం చేస్తాడు. ఆ యువతి పేరు నదిరా బేగం. ఆమె కూడా సలీంతో ప్రేమలో పడుతుంది. ఓ సారి నదిరా బేగం గాన నాట్యాలకు ముగ్దుడైన అక్బర్‌ ఆమెను ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. దానిమ్మ తోటలో(అనార్‌ అంటే హిందీలో దానిమ్మ) కనిపించింది గనుక అనార్కలి అనే బిరుదునిస్తాడు.  సలీం మేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌కు అల్లుడి ప్రేమ విషయం తెలుస్తుంది. అనార్కలిని మరచిపొమ్మని మాన్‌సింగ్‌ హెచ్చరిస్తాడు. సలీం వినకపోయే సరికి అతడిని తనతో పాటు యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడతారు. అప్పుడు సలీం ఆమెను తన వెంట తెచ్చుకుంటాడు. తర్వాత సలీం యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలు చేసి అతన్ని కాపాడుకుంటుంది. అయితే సలీం మామూలు సైనికుడు కాదని  అక్బర్ కొడుకని  తెలుసుకుంటుంది...