ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ


1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని కచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను మీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ చెప్పరు.

3. నేను రాస్తున్నదంతా నా జీవితంలో అనుభవించినవి. మీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాల్లో మీ గుండె గాయపడకుండా ఉంటుందని.

A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ

ఈ కింది విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి..



1. మీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోవద్దు. నేను, మీ అమ్మ తప్ప మీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకోండి.
మీతో మంచిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది. మీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు. జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేరు సుమా!

2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు. తప్పక కలిగి ఉండి తీరవలసింది ఏదీ లేదని మరచిపోకండి. ఇది మీరు అర్థం చేసుకున్న రోజు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని వద్దనుకున్నా, మీరుబాగా కోరుకున్నది మీకు దూరమైనా పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది. ఒకరోజు వ్యర్థమైనా చక్కగా అనుభవించాల్సిన, మళ్లీ తిరిగిరాని ఒకరోజుని కోల్పోయారన్న విషయం గుర్తించుకోండి.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన భావన. కాలాన్ని, మూడ్‌ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించాననుకున్నవారు దూరమైనప్పుడు కుంగిపోకు. ఓపిక పట్టు. కాలం మీకు బాధలను అన్నింటినీ కడిగేస్తుంది. కావాలంటే మీ చుట్టూ ఉన్న వారి జీవితాల్ని గమనించండి. ప్రేమ సౌందర్యాన్ని, అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోవద్దు. అవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటారు.

5.చాలా మంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లుండొచ్చు. కానీ దానర్థం మీరు కష్టపడి చదవకుండానే గొప్పవారయిపోతారని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా మీ ఆయుధాలని గ్రహించాలి. దీవాలా తీసిన స్థితి నుంచి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాధ్యమే. కానీ దివాలా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా మీ ఆధారపడను. అలాగే జీవితాంతం ఆర్థికంగా మీకు ఆసరా ఇవ్వలేను. మీరు పెద్దవారవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా, నీ సొంత లగ్జరీ కారులో తిరుగుతావా? రిచ్‌గా బతుకుతావా? మామూలుగా బతుకుతావా? అన్నది మీరే నిర్ణయించుకోండి.

7. మీరు మీ మాట నిలబెట్టుకోండి. ఇతరుల నుంచి ఇది ఆశించకూడదు. మీరు అందరితో మంచిగా ఉండాలి. అందరూ మీతో మంచిగా ఉంటారని అనుకోవద్దు. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితే ధనవంతులమవుతాం అన్నదానికి ఉదాహరణ ఇదే. విజయానికి షార్ట్‌కట్ లేదని

9. అది ఎంత కాలమైనా సరే, మనం కలిసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా!

-నాన్న

Comments

Popular posts from this blog

India power plant fire: Nine reported dead in major blaze in Telangana

కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?

Gandhi's glasses left in letterbox sell for £260k