అసలు నిజం ఏంటి?
పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు ని జం ఏంటి? ఫొటో సోర్స్, GETTY IMAGES ఫొటో క్యాప్షన్, భారత్ కన్నా ఒక రోజు ముందే తమకు స్వాతంత్ర్యం వచ్చిందని పాకిస్తానీలు వాదిస్తుంటారు బ్రిటిష్ పాలన నుంచి భారత్, పాకిస్తాన్‌లకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకుపైనే గడిచాయి. భారత్‌లో ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతాయి. పాకిస్తాన్‌లో మాత్రం ఒక రోజు ముందుగా, ఆగస్టు 14న ఈ సంబరాలు చేసుకుంటారు. భారత్, పాకిస్తాన్‌లు ఒకేసారి స్వతంత్ర దేశాలుగా మారాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవ తేదీల్లో ఈ తేడా ఎందుకు వచ్చింది? ముస్లింలు పవిత్రంగా భావించే జుమ్మా అల్-వదా రోజున పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని, అది 1947, ఆగస్టు 14న అని పాకిస్తాన్‌లో ప్రచారంలో ఉంది. భారత్ కన్నా ఒక రోజు ముందే తమకు స్వాతంత్ర్యం వచ్చిందని పాకిస్తానీలు వాదిస్తుంటారు కూడా. పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చాక 11 నెలలకు, అంటే 1948 జులై 9న పాకిస్తాన్‌లో తొలిసారి పోస్టల్ స్టాంపులు జారీ చేశారు. ఆ స్టాంపులపై పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు 1947, ఆగస్టు 15 అని స్పష్టంగా ముద్రించి ఉంది. కానీ, ఆ...