నేతాజీ సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU అది 1934. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొంటూ జైలు పాలైన సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం క్రమంగా దిగజారడంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స నిమిత్తం ఆయనను యూరప్‌లోని ఆస్ట్రియాకు పంపింది. అయితే వియన్నాలో చికిత్స పొందుతూనే యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి, వారు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ భావించారు. ఆ సమయంలో ఒక యూరోపియన్ పబ్లిషర్ 'ద ఇండియన్ స్ట్రగుల్' అన్న పుస్తకం రాయాలని ఆయనను కోరారు. దాంతో బోస్‌కు ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది. బోస్ స్నేహితుడైన డాక్టర్ మాథూర్ ఆయనకు రెండు పేర్లను సూచించారు. వారిలో ఒకరు 23 ఏళ్ల ఎమిలీ షెంకెల్. బోస్ ఆ ఆస్ట్రియా యువతిని తన సహాయకురాలిగా నియమించుకున్నారు. ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్‌తో కలిసి పని చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో బోస్‌కు 34 ఏళ్లు. ఎమిలీని కలవడానికి ముందు ఆయన ఆలోచనలన్నీ దేశ స్వాతంత్ర్యం మీదే నిమగ్నమై ఉన్నాయి. అయితే ఎమిలీ తన జీవితంలో ఒక తుపాను తెస్తుందని ఆయన ఊహించలేకపోయారు. ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU ఫొటో క్యాప్షన్, ఏసీఎన్ నంబియార్, హేడీ మిల్లర్, సుభాష...