‘భారత్ మూడు కరోనావైరస్ వ్యాక్సీన్‌లను తయారు చేస్తోంది’
ఫొటో సోర్స్, PIB కరోనావైరస్‌కు కళ్లెం వేసేందుకు మూడు వ్యాక్సీన్‌లను భారత్ తయారు చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోటపై నుంచి ఆయన ప్రసంగించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ''అందరూ కరోనావైరస్ గురించి ఆందోళన పడుతున్నారు. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. భారత్ ఒకటి కాదు.. మూడు వ్యాక్సీన్‌లను తయారు చేస్తోంది. వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తాం'' ''ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా టెక్నాలజీ ఆధారిత నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభిస్తాం. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ఐడీ కార్డులు ఇస్తాం. డాక్టర్ అపాయింట్‌మెంట్ నుంచి మందుల వరకూ అన్ని వీటిలో నమోదుచేస్తాం'' ''ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)లో భాగంగా ఎన్‌డీహెచ్‌ఎంను ప్రారంభిస్తాం. ఆరోగ్య సేవల మెరుగు, పారదర్శకతకు ఇది ఉపయోగపడుతుంది'' ''కరోనావైరస్‌తో పో...