‘భారత్ మూడు కరోనావైరస్ వ్యాక్సీన్‌లను తయారు చేస్తోంది’

 

మోదీ

కరోనావైరస్‌కు కళ్లెం వేసేందుకు మూడు వ్యాక్సీన్‌లను భారత్ తయారు చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్ర కోటపై నుంచి ఆయన ప్రసంగించారు.

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

''అందరూ కరోనావైరస్ గురించి ఆందోళన పడుతున్నారు. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. భారత్ ఒకటి కాదు.. మూడు వ్యాక్సీన్‌లను తయారు చేస్తోంది. వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తాం''

''ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా టెక్నాలజీ ఆధారిత నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభిస్తాం. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ఐడీ కార్డులు ఇస్తాం. డాక్టర్ అపాయింట్‌మెంట్ నుంచి మందుల వరకూ అన్ని వీటిలో నమోదుచేస్తాం''

''ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)లో భాగంగా ఎన్‌డీహెచ్‌ఎంను ప్రారంభిస్తాం. ఆరోగ్య సేవల మెరుగు, పారదర్శకతకు ఇది ఉపయోగపడుతుంది''

''కరోనావైరస్‌తో పోరాడిన యోధులందరికీ దేశం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య రంగ కార్మికులు అందరికీ ధన్యవాదాలు''


ఎర్ర కోట

కొత్త విధానాలతో ముందుకు..

‘‘వచ్చే ఐదేళ్లలో దేశ అంచనాలు, ఆకాంక్షలను అందుకుంటామని గతేడాది ఎర్ర కోటపై నుంచి చెప్పాను. ఈ ఏడాది కాలంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. చాలా ప్రధానమైన లక్ష్యాలను అధిగమించాం’’.

‘‘అసాధారణ సమయాల్లోనూ అసాధ్యంగా అనిపించే లక్ష్యాలను భారత్ చేరుకోగలిగింది. ఇదే సంకల్పంతో ప్రతి భారతీయుడు మందుకు నడవాలి. 2022తో మన స్వాతంత్ర్యానికి 75ఏళ్లు పూర్తవుతాయి’’.

‘‘21వ శాతాబ్దంతో భారత్ కొత్త విధానాలు, కొత్త నిబంధనలతో ముందుకు సాగాలి. ఇప్పుడు సాధాణ విధానాలు పనిచేయవు’’.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి,

పోస్ట్ of Facebook ముగిసింది, 1

కశ్మీరీ శరణార్థులకు గౌరవప్రద జీవితం

''కశ్మీర్‌లో ఈ సంవత్సరం కొత్త అభివృద్ధి కనిపిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో మహిళలు, దళితులకు హక్కులు లభించాయి. శరణార్థులకూ గౌరవ ప్రదమైన జీవితం దక్కింది''.

''లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం. ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది''.

''సేంద్రీయ రాష్ట్రంగా సిక్కిం అడుగులు వేసినట్టే.. రానున్న రోజుల్లో కర్బన్ తటస్థ ప్రాంతంగా లద్దాఖ్ మారబోతోంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి''.


సౌర్వభౌమత్వ పరిరక్షణలో వెనకడుగు వేసేదిలేదు

''ఇలాంటి కష్టమైన సమయాల్లో మన సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాలు జరిగాయి. అయితే మన సైనికులు వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం ఇచ్చారు''.

చైనా పేరును ప్రస్తావించకుండానే మోదీ చురకలు అంటించారు. ''మన సైనికుల శక్తి సామర్థ్యాలను లద్దాఖ్‌లో చూపించారు. వాటిని ప్రపంచం మొత్తం చూసింది''

మోదీ

అకాశాన్ని తాకుతున్న మహిళలు

మహిళలకు అవకాశమిచ్చిన ప్రతిచోటా మన దేశ ప్రతిష్ఠ పెరిగిందని మోదీ చెప్పారు.

''నేడు భూగర్భంలోని గనుల్లోనూ మహిళలు పనిచేస్తున్నారు. యుద్ధ విమానాలతో ఆకాశం అంచూలనూ వారు తాకుతున్నారు''.

''నేడు దేశంలో 40 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరచుకున్నాయి. వీటిలో 22 కోట్లు మహిళలవే''.

''కరోనావైరస్ వ్యాప్తి చెందిన ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేల కోట్ల రూపాయలు ఈ ఖాతాలకు మేం బదిలీ చేశాం''

Comments

Popular posts from this blog

India power plant fire: Nine reported dead in major blaze in Telangana

Gandhi's glasses left in letterbox sell for £260k

India coronavirus: New study shows more women in Delhi had Covid