రోమియో & జూలియట్
రోమియో & జూలియట్ రోమియో & జూలియట్ (షేక్స్పీయర్ రచించిన అద్వితీయ ప్రేమ కావ్యం) షేక్స్పీయర్ ఎంతో చతురతతో ఈ నాటికను రచించాడు.ఎన్నో భావోద్వేగలోతొ మనసును హతుకునట్లు రచించిన ఈ ప్రేమ కథ తరవాత ఎందరో రచయితలను ఎన్నో ప్రేమ కతలు రాయడానికి పురిగొల్పింది. ఇది కేవలం కథ పరిచయం మాత్రమే . రోమియో & జూలియట్ కథ: పూర్వం ఇటలీ దేశంలో వెరోనా అని ఒక నగరం ఉండేది. ఆ నగరం లో క్యాప్యూల్ట్స్ మరియు మాంటెక్ అని రెండు సంపన్న కుటుంబాలు ఉండేవి. ఆ రెండు కుటుంబాలు మధ్య వైరం కారణంగా చంపుకోవడాలు, నరుకోవడాలు ఆ కుటుంబాలకు కోతేమి కాదు. ఎప్పుడు కలహించుకుంటూ రాజ్యంలో భీభత్సవాన్ని సృస్టిస్తూవుంటే, వొకానొక్కా రోజు వెరోనా పట్టణపు యువరాజు విసుగెత్తి మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు ఎర్పడిన, వారి వలన ఏ విధమైన ప్రాణహాని సంభవించిన కారకులు మరణశిక్ష విధిస్తానని శాసనం చేయించి ఆ కుటుంబాలను మందలించి వదిలిపెడతాడు. అప్పటినుంచి ఆ రెండు కుటంబాలు ఒకరితో ఒ...