రోమియో & జూలియట్

                               రోమియో & జూలియట్ 

  రోమియో & జూలియట్ (షేక్స్పీయర్  రచించిన అద్వితీయ ప్రేమ కావ్యం)

షేక్స్పీయర్ ఎంతో చతురతతో ఈ నాటికను రచించాడు.ఎన్నో భావోద్వేగలోతొ మనసును హతుకునట్లు రచించిన ఈ ప్రేమ కథ తరవాత ఎందరో రచయితలను ఎన్నో ప్రేమ కతలు రాయడానికి పురిగొల్పింది. ఇది కేవలం కథ పరిచయం మాత్రమే 


Romeo and Juliet - Wikipedia

.

రోమియో & జూలియట్ కథ:

పూర్వం ఇటలీ దేశంలో వెరోనా అని ఒక నగరం ఉండేది. ఆ  నగరం లో క్యాప్యూల్ట్స్ మరియు మాంటెక్ అని రెండు సంపన్న కుటుంబాలు ఉండేవి. ఆ  రెండు కుటుంబాలు మధ్య వైరం కారణంగా చంపుకోవడాలు, నరుకోవడాలు ఆ కుటుంబాలకు కోతేమి కాదు. ఎప్పుడు కలహించుకుంటూ రాజ్యంలో భీభత్సవాన్ని సృస్టిస్తూవుంటే, వొకానొక్కా రోజు వెరోనా పట్టణపు యువరాజు విసుగెత్తి మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు ఎర్పడిన, వారి వలన ఏ  విధమైన ప్రాణహాని సంభవించిన కారకులు మరణశిక్ష  విధిస్తానని శాసనం  చేయించి ఆ కుటుంబాలను మందలించి వదిలిపెడతాడు. అప్పటినుంచి ఆ రెండు కుటంబాలు ఒకరితో ఒకరు చాల దూరంగా మసులుకుంటూ. ఎవరి పనులు వారు చేసుకుంటూ వుంటారు 



ఈ కథలో కథానాయకుడు రోమియో మాంటెక్ వంశపు జమిందారీ వ్యవస్థకు చెందిన కుర్రాడు రోసాలిన్ అనే అమ్మాయిని  ప్రేమిస్తాడు. కానీ రోసాలిన్కు రోమియో అంటే ఇష్టం ఉండదు కానీ తనకి సోదరుడు వరసైన బెన్ వోలియోను, ముసలివాడు ఐన మిత్రుడు  మొర్కుషియోను వెంటపెట్టుకొని ఆమె మనసుని గెలుచుకోవడానికి  ఆమె వెంట పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు రోమియో. ఐన రోసాలిన్ రోమియో ని తిరస్కరిస్తుంది. ఒకసారి రోసలిన్ ఎవరో స్నేహితురాలి విందుకు వెళ్తుందని తెలుసుకొని రోమియో కూడా మరువేషం లో తన స్నేహితులని వెంట పెట్టుకొని వెళ్తాడు. అక్కడే మొట్టమొదటిసారిగా జూలియట్ని చూస్తాడు.చూడగానే రోమియో ఆలోచనలు మారిపోతాయి. జూలియట్ అందం అతనిని విమర్శిస్తోంది. ఆమె సౌందర్యం ముందు అక్కడి దివిటీలు  కాంతి వెలవెలబోతోంది. ఆమె పేరు ఏమిటి అని అక్కడ ఉన్న వ్యక్తి ని అడుగుతాడు. కానీ రోమియో కి సంధించిన ప్రశ్న టైబాల్డ్ అనే యువకుడికి వినిపిస్తుంది.


 టైబాల్డ్ కాపులెట్స్ వంశానికి సేనాని  వంటివాడు. జూలియట్ కు వరసకు అన్న వంటివాడు. రోమియో ని చూడగానే తన శత్రువు అని వెంటనే గ్రహించేస్తాడు. మాంటెక్ వంశస్తుడు తమ విందు సభలో పాల్గొనడం  చూసి ఆశ్చర్యపోతాడు. అంతలోనే ఆగ్రహంతో తన శత్రువుగా భావిస్తున్న రోమియో పై కత్తి దూయబోతాడు. కానీ కాపులెట్స్ వంశానికి చెందిన పెద్దమనిషి అతని వారిస్తాడు మరోవైపు రోమియో రోసలిన్ ను పూర్తిగా మర్చిపోయి, జూలియట్ ప్రేమ లో మునిగితేలుతుంటాడు కాపులెట్స్ వంశం వారు నిర్వహిస్తున్న ఆ విందు సభలో పెద్ద బ్యాలెట్  జరుగుతుంది. ఆ బ్యాలెట్ ఆఖరి దిశకు చేరే సరికి రోమియో వెళ్లి జూలియట్ కు తన ప్రేమ ప్రతిపాదన తెలియచేసాడు. జూలియట్ కూడా రోమియో ని చూడగానే సర్వం  మర్చిపోతుంది మొదట కొంచం తపటాయించిన, తరవాత రోమియో ప్రేమ ప్రతిపాదన అంగీకరిస్తుంది. అదే రాత్రి జూలియట్ ఇంటి ఆవరణం లో కలుసుకుంటారు. ప్రేమ కాంతిలో వెలిగిపోతున్న వాళ్ళయిద్దరు ప్రేమికులు మాట్లాడాలిఅనుకొని మాట్లాడలేని  అన్ని మాటలు మాట్లాడేసుకుంటున్నారు. మరునాడు మల్లి కలుసుకోవాలనుకుంటారు .


కానీ రోమియో కు తన స్నేహితుల ద్వారా,జూలియట్ కు పరిచారికి ద్వారా తాము పరస్పరం శత్రువులుగా  శత్రువులుగా భావించే కుటుంభంబలకి చెందిన వాళ్ళం అని తెలుస్తుంది. ఇంతలో జూలియట్ కాపులెట్స వంశ పెద్దలు పారిస్ అనే యువకుడికిచి వివాహం చేయడానికి నిశ్చాయిస్తారు. జూలియట్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. పారిస్ కు జూలియట్ అంటే ఎడతెగని మక్కువ. అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు.మరోవైపు రోమియో, జూలియట్ మధ్య జరిగిన వ్యవహారాన్ని టేబెల్ట్ తెలుసుకుంటాడు. అతడు రహస్యం గా ఆమెను కాపుకాయడానికి కొందరు వేగులను నియమిస్తాడు 


ఎలాగైతేనేమి, అదే రోజు రాత్రి మళ్లీ రోమియో, జూలియట్ కలుసుకుంటారు. కన్నీళ్లతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రోదిస్తారు. ఇంతలో రోమియో కి ఒక ఆలోచన స్మరణకి వస్తుంది తాము ఇద్దరం వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది. తాము ఒకసారి దంపతులుగా మారితే తమను ఎవరు విడదీయలేరు కదా! ఈ విష్యం ప్రాయర్ లారెన్స్  అనే ఒక మతం బోధకుడు వీరికి సహాయం చేస్తాడు. ఒక సందర్భం లో వీరి ప్రేమకథను  విని తన దగ్గరుండి పెళ్లి పెద్దగా వారి వివాహాన్ని తన ఇంట్లోనే జరిపిస్తాడు. ఆ రోజు ప్రేమికులు ఇద్దరు ఒకటి అవుతారు. 


పెళ్లి చేసుకొని రోమియో,జూలియట్ గుట్టు చప్పుడు చేయకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. వివాహం  ఒక లారెన్స్ కి మాత్రమే తెలుసు. లారెన్స్ హింసకి వ్యతిరేకి. వెరోనా నగరంలో అలజడి సృష్టిస్తున్న ఈ రెండు కుటుంబాలను ఏకం చేద్దాం అని  ఈ వివాహం చేస్తాడు.  

రోమియో తన ఇంటికి తిరిగి వచ్చేసరికి, అక్కడ విధుల్లో టైబెల్ట్ విద్వాంసం సృష్టిస్తూ కనిపిస్తాడు. రోమియో ఎత్తిపొడుస్తూ, అవమానకరం గా మాట్లాడుతాడు. రోమియో అన్ని మాటలు భరిస్తాడు. ఎంతయినా వాడు మా ఇల్లాలికి  అన్న వరుస కదా అని అనుకుంటాడు. ఆ విధంగా తనని తాను సమాధానపరుచుకుంటాడు. కానీ టైబెల్ట్ తన స్నేహితుడైన ముసలి మార్కిషోయోని అన్యాయంగా చంపేస్తాడు. తన స్నేహితుడి మరణాన్ని  కళ్లారా చుసిన రోమియో టైబెల్ట్ని అడ్డంగా అక్కడికక్కడే నరికి చంపేస్తాడు. 


కానీ నగరం లో వారంతా రోమియో నే తప్పు పడతారు. మహారాజు దగ్గరికి తీసుకువెళ్లి మరణశిక్ష విధించాలని ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతారు. రోమియో వికల మనుస్కుడు అవుతాడు. వెరోనా విడిచి పారిపోయి లారెన్స్ యొక్క చర్చి లో తలదాచుకుంటాడు. తన అన్నని చంపినందుకు జూలియట్ అసహించుకుంటుందేమో అని మధానపడ్డాడు 


టైబెల్ట్ని రోమియో చంపినా వార్త దావానంలా వ్యాపిస్తుంది, జూలియట్ వరకు చేరుతుంది కాపులెట్స్ అందరు రోమియో మీద పగతో ఉంటారు. జూలియట్ తన పరిచారికను రోమియో జాడ కనుకోమని పంపిస్తుంది. కానీ రోమియో పిచ్చి వాడిలాగా ఏవేవో నగరాలూ తిరుగుతూ ఉంటాడు. తాను తన ప్రియురాలు ను కాలవలేడు, కలసి ఆమెను మనోవేదనకు గురి చేయలేడు.


అలా తిరిగి ఆఖరికి లారెన్స్ ఉండే "మంటువ" అనే ఊరు చేరుతాడు. ఎక్కడ జూలియట్ ఇంట్లో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. జూలియట్ పరిష్కారం కొరకు లారెన్స్ని ఆశ్రయిస్తుంది. లారెన్స్ ఆమె కు ఒక ఉపాయం చెప్తాడు ఆమె పై ఒక రసాయనిక ప్రయోగం చేస్తానంటాడు.ఆ రసాయనిక ప్రయోగం వాళ్ళ 48 గంటలు ఊపిరి లేని శవంలా మారిపోతుంది. ఇటాలియన్ సంప్రదాయం ప్రకారం 48 గంటలు శవాన్ని ఖననం చేయరు.48 గంటల తరవాత రసాయనిక ప్రభావం చేత జూలియట్ మాములు మనిషి ఐపోతుంది. అప్పుడు ఆమెను రహస్యం గా తప్పించి రోమియో వద్దకు చేర్చవచ్చు. ఈ ఉపాయం విజయవంతం ఐతే రోమియో, జులైట్లు ఇద్దరు కలవచ్చు. జూలియట్కు లారెన్స్ ని నమ్మడం తప్ప వేరే దారి కనిపించదు. ఆమె ఒప్పుకుంటుంది. లారెన్స్ ఆమె పై రసాయానికం ప్రయోగిస్తాడు. జూలియట్ శవం వాలే మారిపోతుంది 

  

శవంల మారిన జూలియట్ శరీరాన్ని చూసి ఆమె కుటుంబీకులు ఆమె మరణించింది అనుకుంటారు . ఆమె శరీరాన్ని భద్రపరిచే అందుకు సమాధి గృహనికి తీసుకు వెళ్తారు. లారెన్స్ ఇక రోమియో చేయవలిసిన  పని గురించి, తాను చేసిన ప్రయోగం గురించి ఒక లేఖ ద్వారా సమాచారం అందిస్తాడు. అదే సమయం లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్లేగు వ్యాధి ప్రబలడం తో వార్తాహరులు రాకపోకలు ఆగిపోతాయి. 


లారెన్స్ పంపిన వార్త రోమియో కి చేరదు. కానీ రోమియో "మంటువ" నగరం లో కొందరు జూలియట్ మరణ వార్త గురించి చెప్పుకోవడం వింటాడు.వెంటనే ఏడుస్తూ వెరోనా నగరానికి వెళ్తాడు . దారిలో తన ప్రేయసి లేని జీవితం ఎందుకని విషప్రయోగం చేసుకుంటాడు. తాను చనిపోయేలోగా తన భాగస్వామిని ఆఖరిసారిగా చూడాలి అనుకుంటాడు. ఇంకో మూడు గంటలలో  జూలియెట్కి సృహ వస్తుంది అనగా రోమియో గుండెలు పగిలేలా ఏడుస్తూ నగరంలోకి వస్తాడు


కాపులేట్స్ వర్గానికి చెందిన వ్యక్తులు రోమియో ని చుట్టూ ముడుతారు. వారందరిని ఎదిరించి శవపేటిక వద్దకి వస్తాడు. అదే సమయం లో జూలియట్ ని వివాహం చేసుకోవాలి అనుకున్న పారిస్ అక్కడికి వచ్చి అడ్డుకుంటాడు. పిచ్చి ఆవేశం లో ఉన్న రోమియో పారిస్ ను అక్కడికక్కడే హతమారుస్తాడు 


జూలియట్ శరీరాన్ని గుండెలకి హత్తుకొని ఆఖరి ముద్దు పెట్టి శ్వాస విడుస్తాడు రోమియో. అప్పుడే జూలియట్ కళ్ళు తెరుస్తుంది ఆమెకు పరిస్థితి అర్థం అవుతుంది. జరిగిన పరిస్థితి విని లారెన్స్ అక్కడికి వస్తాడు. జూలియట్ ని బంధించడానికి సైనికులు ముందుకు వస్తారు. జూలియట్ తన భర్త ఐనా రోమియో శరీరం పై విలపిస్తూ అతని వద్ద ఉన్న చురకత్తి తీసుకుని గుండెల్లో పొడుచుకుంటుంది


ఈ విధంగా రోమియో జూలియట్ల ప్రేమ కథ విషాద భరితంగా ముగుస్తుంది 

Comments

Popular posts from this blog

India power plant fire: Nine reported dead in major blaze in Telangana

కరోనావైరస్: 700 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ వేయటం ఎలా?

Gandhi's glasses left in letterbox sell for £260k